Mayawati Yogi : సీఎం యోగిపై మాయావతి ఫైర్
మైనార్టీలను టార్గెట్ చేస్తే ఎలా
Mayawati Yogi : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కుమారి మాయావతి(Mayawati) సంచలన కామెంట్స్ చేశారు. ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi) పై నిప్పులు చెరిగారు. రెండోసారి కొలువు తీరిన యోగి ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
అంతే కాదు ప్రత్యేకించి మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు మాయావతి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు.
జైలు జీవితం గడుపుతున్న ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ ఆ పార్టీని వీడనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మాయావతి(Mayawati) మైనార్టీలకు మద్దతుగా మాట్లాడటం, సీఎంను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది.
ప్రత్యేకించి ఆయనకు మద్దతుగానే ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరిగింది. యోగి ప్రభుత్వం కావాలని మైనార్టీల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందంటూ ఫైర్ అయ్యింది.
మైనార్టీ నాయకులను వేధింపులకు గురి చేయడం, అక్రమ కేసులు బనాయించడం షరా మామూలుగా మారిందన్నారు. ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడం అంటే ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, కొన్ని వర్గాలను ఇబ్బందులపాలు చేయడం కాదన్నారు.
సీఎంగా కొలువు తీరాక ఎలాంటి వివక్ష చూపకూడదన్న విషయం తెలుసుకుంటే మంచిదని యోగికి హితవు చెప్పారు మాయవతి(Mayawati).
ఒక్క యూపీలోనే కాదు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలలో మైనార్టీలు, ఇతర వర్గాలను టార్గెట్ గా వేధింపులకు గురి చేస్తూ రావడం దారుణమన్నారు.
రాజకీయ ప్రత్యర్థుల పట్ల ద్వేష పూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు.
Also Read : ఎన్డీఏను ఢీకొనేందుకు కూటమి