Mayawati : యూపీలో ఎన్నికలు ముగిసినా మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీఎస్పీ చీఫ్ మాయావతిని టార్గెట్ చేశారు.
ఆమె ఈసారి ఎన్నికల్లో ఏదో పదవి ఆశించి తన ఓటు బ్యాంకును బీజేపీకి బదలాయించిందంటూ ఆరోపించారు. దీనిపై మాయావతి(Mayawati)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రపతి కావాలని అనుకోవడం లేదని, ప్రధానమంత్రి కావాలని ఉందన్నారు.
దీనిపై సెటైర్ వేశారు అఖిలేష్ యాదవ్. ఎస్పీ చీఫ్ పై సీరియస్ అయ్యారు మాయావతి. తన సొంత కలనే నెర వేర్చుకోలని నాయకుడు ప్రజలకు ఎలా జవాబుదారీగా ఉంటారంటూ ప్రశ్నించింది.
ఒకప్పుడు ఇద్దరూ పొత్తు పెట్టుకున్నారు. కలిసి పోటీ చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై మరొకరు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకుంది వీరిద్దరి మధ్య యుద్దం.
2019 లోక్ సభ ఎన్నికలకు ముందు మాయావతికి చెందిన బీఎస్పీ తనతో పొత్తు పెట్టుకుందన్నారు. ఈ సందర్బంగా మాయావతి(Mayawati) ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకల రేపింది.
ముస్లింలు, యాదవుల ఓట్లను సాధించి అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా సీఎం కావాలనే తన సొంత కలను ఎస్పీ చీఫ్ నెరవేర్చ లేక పోయాడంటూ ఎద్దేవా చేశారు.
ఆనాటి ఎన్నికల్లో ఎస్పీ కేవలం 5 సీట్లకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు. వాస్తవాలు తెలుసు కోకుండా అఖిలేష్ యాదవ్ ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు మాయావతి.
Also Read : రాహుల్ గాంధీ నాకు బెస్ట్ ఫ్రెండ్ – పీకే