Mayawati & Nupur Sharma : నూపుర్ శర్మపై తీర్పు ఓ గుణపాఠం
ఆమె వెంటనే దేశానికి క్షమాపణ చెప్పాలి
Mayawati & Nupur Sharma : ప్రవక్త మహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అంతే కాదు బేషరత్తుగా దేశానికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది.
అధికారంలో ఉన్నాం కదా అని, పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ అయినంత మాత్రాన చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ఉందా అని జస్టిస్ సూర్యకాంత్ నిప్పులు చెరిగారు.
నూపుర్ శర్మ కామెంట్స్ చేయడమే కాకుండా తాను లాయర్ నని చెప్పుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇవాళ దేశం తగలబడి పోవడానికి కారణం ఆమె చేసిన కామెంట్సేనని సీరియస్ అయ్యారు.
ఆపై రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ దారుణ హత్యకు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ సీఎం కుమారి మాయావతి(Mayawati & Nupur Sharma) స్పందించారు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా నూపుర్ శర్మపై ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశానికి కనువిప్పు కావాలన్నారు. ఆమె బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు మాయావతి.
రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దేశాన్ని హింసాత్మక వాతావరణంలోకి నెట్టి వేసినందుకు బాధ్యురాలిని చేయడం బీజేపీకి ఓ చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు.
మతవాద మంటలలో రాజకీయాలను విసరే వారందరికీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓ గుణపాఠం లాంటిందని హెచ్చరించారు మాయావతి. ఆమె పట్ల పోలీసుల వైఖరిని కూడా తప్పు పట్టడంపై జస్టిస్ కు ధన్యవాదాలు తెలిపారు మాయావతి.
Also Read : నూపుర్ శర్మ దేశానికి క్షమాపణ చెప్పాలి
1. माननीय सुप्रीम कोर्ट द्वारा नूपुर शर्मा के विरुद्ध आज लिए गए सख़्त स्टैण्ड तथा अपने भड़काऊ बयान से देश को हिंसक माहौल में झोंकने हेतु उनसे माफी माँगने का निर्देश उन सभी के लिए ज़रूरी सबक है जो देश को साम्प्रदायिकता की आग में झोंक कर अपनी राजनीति चमका रहे हैं। 1/2
— Mayawati (@Mayawati) July 1, 2022