Mayawati : మహనీయుడికి మరణం లేదు – మాయావతి
సిద్దాంతకర్తకు మాజీ సీఎం నివాళి
Mayawati : బహుజన్ సమాజ్ పార్టీ సిద్దాంతకర్త మాన్యశ్రీ కాన్షీరాం వర్దంతి ఇవాళ. ఈ సందర్భంగా బీఎస్పీ చీఫ్, మాజీ సీఎం మాయావతి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాయావతి(Mayawati) ప్రసంగించారు.
ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం కావాలని కోరుకున్న ఏకైక నాయకుడు, రాజకీయవేత్త కాన్షీరాం(Kanshi Ram) మాత్రమేనని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం.
కొన్ని వర్గాలే నేటికీ పాలకులుగా చెలామణి అవుతున్నారని కానీ ఇంకా 75 శాతానికి పైగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలను ఒక రకంగా భయాందోళనకు గురి చేసిన ఏకైక పార్టీ బీఎస్పీనేనని పేర్కొన్నారు. కాన్షీరాం చూపిన మార్గంలో నేటికీ కోట్లాది మంది నడుస్తున్నారని చెప్పారు మాయావతి.
కులాలు, ప్రాంతాలు, మతాల పేరుతో మనుషులను విడదీసే కొత్త రాజకీయం రాజ్యం ఏలుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ చీఫ్. గత కొన్నేళ్లుగా బహుజన్ సమాజ్ తన రాజ్యాంగ , చట్ట పరమైన హక్కులను డిమాండ్ చేస్తూనే వస్తున్నదని పేర్కొన్నారు మాయావతి(Mayawati).
అణగారిన వర్గాలు, జాతులు, కులాలుగా విడి పోయిన వారంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఎప్పుడైతే పాలక సమాజంలో ఉంటామో ఆనాడే కోరుకున్నది దక్కుతుందని స్పష్టం చేశారు. కాగా కాన్షీరాం మహనీయుడని, ఆయనకు మరణం అన్నది లేదనే లేదన్నారు బీఎస్పీ చీఫ్.
కాన్షీరాం ఎంతో ముందు చూపుతో బీఎస్పీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన వల్లనే అధికారంలోకి రాగలిగామని గుర్తు చేసుకున్నారు. కాన్షీరాం తనకు గురువైనందుకు గర్వంగా ఉందన్నారు మాయావతి.
Also Read : సౌర విద్యుత్ గ్రామంగా ‘మోధేరా’ రికార్డ్