MCD Mayor Elections : 22న ఢిల్లీ మేయర్ ఎన్నిక – సుప్రీం
ఆదేశించిన అత్యున్నత న్యాయ స్థానం
MCD Mayor Elections : దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికతో పాటు నామినేటెడ్ సభ్యుల ఎన్నికపై భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆప్, బీజేపీ మధ్య చోటు చేసుకున్న వివాదం కారణంగా మూడుసార్లు ఎన్నిక వాయిదా పడింది. చివరకు కోర్టుకు చేరింది ఈ సమస్య. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 22న ఎన్నికలు జరపాలని ఆదేశించింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేసింది.
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి , కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు మధ్య ఆధిపత్య పోరులో ఎంసీడీ మేయర్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. బుధవారం రోజు ఎంసీడీ సదన్ లో ఉదయం 11 గంటలకు నిర్వహించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన ఢిల్లీ పౌర సంఘం సభ్యులు మేయర్ ను ఎన్నుకునే ఎన్నికల్లో(MCD Mayor Elections) ఓటు వేయరాదంటూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.
ఇది ఒక రకంగా కేంద్ర సర్కార్ కు, ప్రధానంగా చక్రం తిప్పుతూ వస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా మేయర్ ఎన్నిక ముందు జరుగుతుంది. అనంతరం డిప్యూటీ మేయర్ తో పాటు 6 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను అదే రోజు ఎన్నుకుంటారు.
ఇదిలా ఉండగా ఎల్జీ సక్సేనా సభ్యుల ఓటింగ్ హక్కులపై కోర్టు(Supreme Court) ధిక్కారానికి పాల్పడ్డారంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కొద్ది గంటలకే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
Also Read : ముందు సీటు కోసం ఎస్పీ విన్నపం