MCD Polls AAP : ఢిల్లీ బల్దియాపై ఆప్ దే జెండా
ఎంసీడీ ఎన్నికల్లో కేజ్రీవాల్ హవా
MCD Polls AAP : ఢిల్లీ మహానగర కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 250 వార్డులకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఈసారి ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చి కాషాయ జెండాను ఎగుర వేయాలని చేసిన ప్రయత్నం ఫలించ లేదు. ఎంసీడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆప్ ను బద్నాం చేయడంలో సక్సెస్ అయ్యింది.
బీజేపీతో పాటు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం కూడా బరిలో నిలిచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రభావం ఢిల్లీ వాసులపై చూపించ లేదని అర్థమై పోయింది. మహానగర పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఇదే సమయంలో ఢిల్లీ బల్దియా ఎన్నికలతో పాటు గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కూడా అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(MCD Polls AAP) బరిలో నిలిచింది.
పెద్ద ఎత్తున సీఎం ప్రచారం చేశారు. కానీ ఆశించినంత మేర ఫలితాలు రాక పోవచ్చని అంచనా వేశాయి. మరో వైపు ఢిల్లీ మరోసారి తమదేనని ఆప్ సత్తా చాటేందుకు సిద్దమైంది. నువ్వా నేనా అంటూ పోటా పోటీగా సాగిన ఎంసీడీ ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూపించాయి.
ఢిల్లీ బల్దియా గడ్డపై ఆప్ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే ఆజ్ తక్ యాక్సిస్ మై ఇండియా ఆప్ కు 149 నుంచి 171 వస్తాయని , బీజేపీకి 69 నుంచి 91 , కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 9 సీట్లు వస్తాయని తెలిపింది.
ఇక న్యూస్ ఎక్స్ జెన్ కీ బాత్ అంచనా ప్రకారం బీజేపీకి 70 నుంచి 92 సీట్లు, ఆప్ కు 159 నుంచి 175 సీట్లు , కాంగ్రెస్ కు ఒక సీటు మాత్రం వస్తుందని తెలిపింది. టైమ్స్ నౌ ఛానల్ బీజేపీకి 84 నుంచి 94 , ఆప్ కు 146 నుంచి 156 , కాంగ్రెస్ కు 4 సీట్లు వస్తాయని పేర్కొంది.
ఇక జీ న్యూస్ – బార్క్ కలిసి చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 82 నుంచి 94 , ఆప్ కు 134 నుంచి 146 , కాంగ్రెస్ కు 14 నుంచి 19 సీట్లు వస్తాయని పేర్కొంది.
Also Read : ఎగ్జిట్ పోల్స్ లో కమల వికాసం