Rajnath Singh : ప్ర‌జాస్వామ్యానికి మీడియా పునాది

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh : భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక మీడియా సంస్థ‌ల‌పై ఎలాంటి నిషేధం విధించ లేద‌ని గుర్తు చేశారు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) . ఇప్ప‌టి వ‌ర‌కు తాము క‌క్ష‌సాధింపు ధోర‌ణి ప్ర‌ద‌ర్శించ లేద‌ని అన్నారు. గ‌తంలో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాల కాలంలోనే ప్ర‌చుర‌ణ‌, ప్రసార సాధాన‌ల‌పై ఎక్కువ‌గా నిషేధం విధించింద‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా కూడా టాప్ లో కొన‌సాగుతోంద‌ని, వ్య‌తిరేక వార్త‌లు రాసినా తాము ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు. కానీ దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే విధంగా, స‌మాజంపై చెడు ప్ర‌భావం ఉండేలా చేస్తున్న యూట్యూబ్ ఛాన‌ళ్లు, ఇత‌ర సంస్థ‌ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేశామ‌ని స్ప‌ష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్.

గ‌త కాంగ్రెస స‌ర్కార్ హ‌యాం అంతా అన్ని ర‌కాల స్వేచ్ఛ‌ల‌కు భంగం క‌లిగించే సంఘ‌ట‌న‌ల‌తో నిండి ఉంద‌ని ఆరోపించారు కేంద్ర మంత్రి. బ‌ల‌మైన , శ‌క్తివంత‌మైన ప్ర‌జాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్య‌మ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) . కానీ త‌మ‌ను కావాల‌ని బ‌ద్నాం చేస్తున్నారంటూ మంత్రి ఆవేదన వ్య‌క్తం చేశారు.

ప‌త్రికా స్వేచ్ఛ‌ను ఉల్లంఘించారంటూ ఆరోపిస్తున్న వారి ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. ఏ మీడియా సంస్థ‌ల‌పై నిషేధం విధించామో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు రాజ్ నాథ్ సింగ్. ఎవ‌రికీ వాక్ స్వాతంత్ర హ‌క్కును హ‌రించ లేద‌ని ఇంకా ప్రోత్స‌హించామ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయి.

Also Read : ఢిల్లీ ఎల్జీపై కేజ్రీవాల్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!