TRAI Chief Vaghela : మీడియా ఓనర్ల వల్ల డెమోక్రసీకి ముప్పు
ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా కామెంట్స్
TRAI Chief Vaghela : టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ పీడీ వాఘేలా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఏకంగా ప్రచురణ, ప్రసార సాధనాలకు సంబంధించిన యాజమాన్యాలపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రధానంగా మీడియా యాజమాన్యం ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మిట్ లో వాఘేలా(TRAI Chief Vaghela) పాల్గొని ప్రసంగించారు. రెగ్యులేటరీ బాడీ లోని నిపుణులు ఓవర్ ది టాప్ సేవలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ఇదే క్రమంలో టెలికాం, ప్రసార నియంత్రణ సంస్థ (ట్రాయ్ ) దీనికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సిఫారసులపై కసరత్తు చేస్తోందని చెప్పారు.
సరైన ఫ్రేమ్ వర్క్ తో ముందుకు రావాలని కోరారు. సాంకేతిక అంతరాయం ద్వారా సృష్టించబడిన అసమానతలను తొలగిస్తుందన్నారు. మీడియా మేనేజ్ మెంట్ కు సంబంధించిన ఫోకస్ అనేక సమస్యలతో గుర్తించడం జరిగింది. నిస్సందేహంగా చెప్పాల్సి వస్తే అత్యంత ముఖ్యమైనది భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చి పెట్టడం తప్ప ఇంకోటి కాదన్నారు.
ప్రధానంగా ట్రాయ్ తరపున మీడియా యాజమాన్యాలకు సంబంధించిన సమస్యలపై సిఫారసులను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా.
ఇక డిజిటల్ టెక్నాలజీ రాకతో రంగంలో తీవ్రమైన మార్పులు వచ్చాయన్నారు. క్రాస్ మీడియా యాజమాన్యం, నియంత్రణ, మెకానిజం, సంబంధిత సమస్యలపై పర్యవేక్షణపై ట్రాయ్ ఇవాళ ఒక కన్సల్టేషన్ పేపర్ ను విడుదల చేసింది. కాగా మీడియా యాజమాన్యంపై రెగ్యులేటర్ 2014లో కొన్ని సిఫారసులు జారీ చేసింది. దానికి ఇంకా కేంద్రం ఆమోదించ లేదు.
Also Read : విమాన జర్నీలో మాస్క్ తప్సనిసరి కాదు