Medico Preethi Case : ప్రీతిది ఆత్మ‌హ‌త్య కాదు హ‌త్యే

తండ్రి, సోద‌రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Medico Preethi Case : నాలుగు రోజుల కింద‌ట ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన వ‌రంగ‌ల్ జిల్లా గిర్ని తాండాకు చెందిన ధరావ‌త్ ప్రీతి ఆదివారం రాత్రి క‌న్నుమూశారు. అత్యంత కట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య అంత్య‌క్రియ‌లు చేప‌ట్టేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. పోలీసులు భారీగా మోహ‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్రీతిది సూసైడ్ కాద‌ని ముమ్మాటికీ హ‌త్యేన‌ని(Medico Preethi Case) ఆరోపించారు ప్రీతి తండ్రి, సోద‌రి. ఆమె అంత పిరికిది కాద‌న్నారు.

ఎవ‌రు చెప్పారు మీకు..నా కూతురును పొట్ట‌న పెట్టుకున్నారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నారో ప్ర‌పంచానికి తెలియాల్సిన అవ‌స‌రం ఉంది. ఇవాళ నా కూతురు చ‌ని పోయింది. రేపు ఇంకొక‌రు చ‌ని పోర‌ని గ్యారెంటీ ఏంటి అని ప్ర‌శ్నించారు. ప్రీతికి ఇంజ‌క్ష‌న్ ఇచ్చి సైఫ్ చంపేశాడంటూ ఆరోపించారు. అధికారుల‌కు చెప్పినా ప‌ట్టించు కోలేద‌ని వాపోయారు. ఒక‌వేళ స్పందించి ఉంటే వెంట‌నే ప్రీతి బ‌తికి ఉండేద‌న్నారు.

సోద‌రి కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న సోద‌రి చ‌నిపోతుంద‌ని అనుకోలేదు. సైఫ్ ఒక్క‌డే కాదు ప్రీతి(Medico Preethi) చావు వెనుక మ‌రికొంద‌రు ఉన్నారు. వారు కూడా బ‌య‌ట‌కు రావాలి. ప్రీతి త‌న‌కు తాను గా మ‌త్తు ఇంజ‌క్ష‌న్ తీసుకోలేద‌ని ఆరోపించారు. కొంద‌రు ప‌ట్టుకుంటే సైఫ్ ఇంజ‌క్ష‌న్ ఇచ్చాడ‌ని , న‌లుగురిని ఎదిరించే బ‌లం కూడా త‌న సోద‌రికి లేద‌న్నారు. ప్రీతి చావును నిరసిస్తూ భారీ ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజ‌న సంఘాలు పెద్ద ఎత్తున మండి ప‌డుతున్నాయి. ప్ర‌భుత్వం ఎందుకు నోరు విప్ప‌డం లేదంటూ ప్ర‌శ్నించాయి. ప్రీతి కుటుంబానికి రూ. 5 కోట్ల సాయం ప్ర‌కటించాల‌ని, ఒక‌రికి గ్రూప్ -1 పోస్టు ఇవ్వాల‌ని, సైఫ్ ను ఉరి తీయాల‌ని డిమాండ్ చేశాయి.

Also Read : ర్యాగింగ్ భూతం ప్రీతి మ‌ర‌ణం

Leave A Reply

Your Email Id will not be published!