Medigadda Row : హైదరాబాద్ – మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి ప్రస్తుతం వివాదం చోటు చేసుకుంది. ప్రతిపక్షాలు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన బ్యారేజ్ ఉన్నట్టుండి కుంగి పోవడం విస్తు పోయేలా చేసింది. ఇక ప్రభుత్వం ప్రపంచంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లేదంటూ ప్రచారం చేసుకుంది. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Medigadda Row Viral
దీంతో రంగంలోకి దిగింది సర్కార్. ఈ నిర్మాణం చేపట్టింది ఎల్ అండ్ టి సంస్థ. సంస్థ ప్రతినిధులు సైతం వరద ఉధృతి ఎక్కువగా రావడం వల్లనే కుంగి పోయిందంటూ చిలుక పలుకులు పలికారు. తాజాగా మరో అంశాన్ని ముందుకు తీసుకు వచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోవడం వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయన్న అనుమానం వ్యక్తం చేసింది రాష్ట్ర నీటి పారుదల శాఖ.
మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్(Medigadda Lakshmi Barriage) లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుంట్ర జరిగిందన్న అనుమానం తో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఏఈ ఇంజనీర్ రవికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3,4 సెక్షన్లతో పాటు ఐపీసీ 427 కింద కేసు నమోదు చేశారు.
Also Read : Komatireddy Raja Gopal Reddy : హస్తం గూటికి కోమటిరెడ్డి