G23 Leaders : గులాం నివాసంలో అసమ్మతి నేతల భేటీ
సీడబ్ల్యూసీ చీఫ్ ఎన్నికపై కీలక సమావేశం
G23 Leaders : సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించి ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన ట్రబుల్ షూటర్ గా పేరొందిన గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు.
ఆయన వెళుతూ సంచలన ఆరోపణలు సంధించారు. లెక్కలేనన్ని ప్రశ్నలు గుప్పించారు. ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆయన వల్లనే పార్టీ సర్వ నాశనమైందని మండిపడ్డారు.
ఇదే సమయంలో సోనియా గాంధీ పట్ల సానుకూలంగా స్పందించారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లల మనస్తత్వం కారణంగా పార్టీకి తీరని నష్టం వాటిల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపై ఓ కోటరీ పక్కదారి పట్టించిందని పూర్తిగా సీనియర్లను పక్కన పెట్టేశారంటూ ధ్వజమెత్తారు. దీంతో ఆజాద్ చేసిన కామెంట్స్ కల్లోలోం సృష్టించాయి.
ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో ఆజాద్ పావుగా మారారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ మీడియా ఇన్ చార్జ్ జైరాం రమేష్. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే పార్టీని వీడారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఫ్యామిలీ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు సీనియర్ నాయకులు. వారంతా జి23 (G23 Leaders) పేరుతో ఏర్పాటయ్యారు. సమావేశాలు కూడా నిర్వహించారు.
ఈ కూటమిలో కీలక పాత్ర పోషించారు గులాం నబీ ఆజాద్. తాజాగా ఆయన వెంట మరికొందరు సీనియర్లు పార్టీని వీడనున్నారు. శనివారం ఆజాద్ తో కీలక భేటీ జరగనుంది. మరో వైపు సీడబ్ల్యూసీ కూడా చీఫ్ ఎన్నికపై సమావేశం కానుండడం విశేషం.
Also Read : సర్కార్లు కూల్చేందుకు రూ. 6,300 కోట్లు