Mega Farmers Meet : రెజ్ల‌ర్ల కోసం రైత‌న్న‌ల స‌మావేశం

నేడే ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ కీల‌క భేటీ

Mega Farmers Meet : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన మ‌హిళా రెజ్ల‌ర్ల పోరాటం మ‌రింత ఉదృతం సాగేలా క‌నిపిస్తోంది. ఈ మేర‌కు గురువారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ లో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. మ‌హిళా రెజ్ల‌ర్ల‌కు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు(Farmers) మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయూ) అగ్ర నేతలు రాకేశ్ టికాయ‌త్, న‌రేష్ టికాయ‌త్ మ‌హిళా రెజ్ల‌ర్లు త‌మ బిడ్డ‌లేనంటూ స్ప‌ష్టం చేశారు. వారికి అన్యాయం జ‌రిగితే స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.

తాము సాధించిన ప‌త‌కాల‌ను గంగ‌లో నిమ‌జ్జ‌నం చేయాల‌ని సంక‌ల్పించిన రెజ్ల‌ర్ల‌ను(Wrestlers) శాంతింప చేశారు. ఈ మేర‌కు కేంద్రానికి 5 రోజుల గ‌డువు విధించారు. లేక పోతే దేశ మంత‌టా ఆందోళ‌న‌ను మ‌రో రైతు పోరాటంగా మారుస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇవాళ జ‌రిగే స‌మావేశంపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే మ‌హిళా రెజ్ల‌ర్ల‌తో పాటు రైతు నేత‌లు చేరుకున్నారు. భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నున్నారు.

మ‌రో వైపు తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ తాను ఎలాంటి త‌ప్పు చేయలేద‌ని ప్ర‌క‌టించారు. నార్కో టెస్టుకు తాను రెడీగా ఉన్నాన‌ని వాళ్లు కూడా రెడీనా అంటూ స‌వాల్ విసిరారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు రుజువైతే ఉరి వేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రైతు నాయ‌కులు. వెంట‌నే చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌రో వైపు ప్ర‌పంచ రెజ్లింగ్ స‌మాఖ్య సీరియ‌స్ అయ్యింది. 45 రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని స్ప‌ష్టం చేసింది. మ‌హిళ‌ల‌పై దాడిని తీవ్రంగా ఖండించింది.

Also Read : Bhatti Vikramarka

Leave A Reply

Your Email Id will not be published!