Acharya Movie : మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీ వాయిదా

చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు

Acharya Movie : సంక్రాంతి పండ‌గ వేళ మెగా ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపు దిద్దుకున్న ఆచార్య మూవీ రిలీజ్ ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్.

ఇప్ప‌టికే క‌రోనా క‌ల‌కలం దెబ్బ‌కు రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రాధా శ్యామ్ , జ‌క్క‌న్న తీసిన ఆర్ఆర్ఆర్ సైతం ఇప్ప‌టికే వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాలతో పాటు ఆచార్య సినిమా(Acharya Movie) కూడా చేరింది.

ఓమిక్రాన్ , క‌రోనా దెబ్బ‌కు ఈ సంక్రాంతికి సంద‌డి చేయాల‌ని భావించాయి. కానీ ఊహించ‌ని దెబ్బ ప‌డింది. అయితే రొమాంటిక్ హీరో అక్కినేని నాగార్జున‌, త‌న‌యుడు నాగ చైత‌న్య , ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి, ఫ‌రియా అబ్దుల్లా క‌లిసి న‌టించిన బంగార్రాజు చిత్రం విడుద‌లైంది.

మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య మూవీని ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. కాగా ఆ డేట్ కాకుండా కొత్త తేదీతో మీ ముందుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేసింది చిత్ర యూనిట్.

ఇక మూవీ ప‌రంగా చూస్తే మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మూవీకి సంబంధించిన పాట‌లు ఇప్ప‌టికే ఆద‌ర‌ణ చూర‌గొన్నాయి. మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు పండ‌గ సంద‌ర్భంగా క‌రోనా రూల్స్ పాటించాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌డంపై మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గుర‌య్యారు.

Also Read : రౌడీ బాయ్స్ కు ప్ర‌భాస్ అభినంద‌న‌

Leave A Reply

Your Email Id will not be published!