Statue Of Equality : జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి సత్ సంకల్పంతో ఏర్పాటు చేసిన సమతా కేంద్రం (Statue Of Equality )ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. పదేళ్ల కిందట తను ఆరాధించే శ్రీ భగవద్ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
అది ఇవాళ సాక్షాత్కారమైంది. వేలాది మంది భక్తులకు సాంత్వన చేకూరుతోంది. ఆ మహానుభావుడు ఈ పవిత్ర భారత భూమిపై జన్మించి 1017 ఏళ్లవుతోంది.
కులం, మతం మనుషుల్ని విడదీస్తుందని పండితులకే కాదు పామరులు, సామాన్యులు, దళితులు, అంటరానివారికి కూడా దైవం సమానమేనని ఆనాడే సమతా సందేశాన్ని వినిపించాడు శ్రీ రామానుజుడు.
మనుషులంతా సమానులే, సకల జీవ రాశులు ఒక్కటేనని పిలుపునిచ్చాడు. తనకు గురువు బోధించిన తిరు మంత్రాన్ని వద్దన్నా అందరికీ చేరాలని వినిపించిన సంఘ సంస్కర్త.
ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్లవకారుడు. సెలబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తలు, అన్ని రంగాలకు చెందిన వారంతా 216 అడుగులతో ఏర్పాటు చేసిన సమతామూర్తిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు.
ఇందు కోసం రూ. 1000 కోట్లు ఖర్చు(Statue Of Equality )చేశారు. చైనాకు చెందిన కంపెనీ తయారు చేసింది. 108 దివ్య దేశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మెగా స్టార్ చిరంజీవి రానున్నారు.
చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు అందుకోనున్నారు. ఇక ఉత్సవాలలో భాగంగా అష్టాక్షరీ కోటి మంత్ర పఠనం చేశారు. శ్రీరామ పెరుమాళ్ స్వామికి ప్రాతఃకాల ఆరాధాన నిర్వహించారు.
అనంతరం వేద పారాయణం చేపట్టారు. శ్రీ లక్ష్మి నారాయణ మహా యజ్ఞం చేశౄరు. ఇష్టి శాలలో వ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్య కోసం పరమేష్టి యాగాన్ని చేపట్టారు.
విజ్ఞ దోష నివారణ, పితృదేవతల తృప్తి కోసం వైభవేష్టి , శ్రీ వాసుదేవ అష్టోత్తర పూజ చేశారు.
Also Read : రామానుజుడి కోసం వెంకయ్య రాక