Meghalaya CM : హైదరాబాద్ – మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా శుక్రవారం హైదరాబాద్ కు విచ్చేశారు . ఈ సందర్బంగా ఆయన ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
Meghalaya CM Meet KCR
మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మాకు సాదర స్వాగతం పలికారు కేసీఆర్. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చారు. మంత్రి కేటీఆర్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, డాక్టర్ దాసోజు శ్రవణ్, తదితర నాయకులను పరిచయం చేశారు సీఎంకు.
అనంతరం కేసీఆర్(KCR) తో భేటీ అయ్యారు మేఘాలయ ముఖ్యమంత్రి. దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ఈ ఇద్దరు సీఎంలు చర్చించుకున్నారు. త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా భావ సారూప్యత కలిగిన నాయకులు, పార్టీలు, సీఎంలతో చర్చలు జరుపుతున్నారు సీఎం కేసీఆర్. కీలకమైన అంశాల గురించి చర్చించడం జరిగిందని స్పష్టం చేశారు ఇద్దరు సీఎంలు కేసీఆర్, కాన్రాడ్ కె. సంగ్మా.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాన్రాడ్ కె. సంగ్మా రెండోసారి సీఎంగా కొలువు తీరారు. ఆయనను ఓడించాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ కదపలేక పోయింది. ఆ తర్వాత తను కూడా మనసు మార్చుకుని కాన్రాడ్ ప్రభుత్వంతో చేతులు కలిపింది. సంగ్మా మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా గుర్తింపు పొందారు.
Also Read : CM KCR : 15న 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం