Mehbooba Mufti : మాజీ రాష్ట్ర‌ప‌తిపై ముఫ్తీ మండిపాటు

కోవింద్ బీజేపీ ఎజెండా అమ‌లు చేశారు

Mehbooba Mufti : 14వ రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన రామ్ నాథ్ కోవింద్(Ramnath Kovid) పై నిప్పులు చెరిగారు జ‌మ్మూ , కాశ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ. సోమ‌వారం ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

భార‌త దేశ రాజ్యాంగానికి తిలోదకాలిచ్చారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎజెండాను అమ‌లు చేశార‌ని, ఇందులో స‌క్సెస్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు మాజీ సీఎం.

ఇదిలా ఉండ‌గా ఇవాళ 15వ రాష్ట్ర‌ప‌తిగా ఒడిశాకు చెందిన ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆమె తో పాటు మాజీ రాష్ట్ర‌ప‌తి కూడా హాజ‌ర‌య్యారు.

ఆమె ప్ర‌మాణం చేసిన వెంట‌నే మాజీ రాష్ట్ర‌ప‌తిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంబేద్క‌ర్ రాసిన భార‌త రాజ్యాంగాన్ని గ‌త ఎనిమిది ఏళ్లుగా తుంగ‌లో తొక్కుతూ వ‌చ్చారు.

పూర్తిగా హిందూత్వ‌, కాషాయ జెండాను అమ‌లు చేస్తూ వ‌చ్చార‌ని ఆరోపించారు ఆమె. దేశానికి రాష్ట్ర‌ప‌తిగా ఏనాడూ వ్య‌వ‌హ‌రించ లేద‌ని పేర్కొన్నారు.

ఆర్టిక‌ల్ 370, సీఏఏ ర‌ద్దు చేసినా మైనార్టీలు, ద‌ళితుల‌పై దాడులు జ‌రిగినా ఏరోజు నోరు విప్ప లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మెహ‌బూబా ముఫ్తీ(Mehbooba Mufti) .

అన్నింటిని ప‌క్క‌న పెట్టి కేవ‌లం బీజేపీ ఎజెండాను మాత్ర‌మే అమ‌లు చేస్తూ వ‌చ్చార‌ని మండిప‌డ్డారు.

2019లో జ‌మ్మూ కాశ్మీర్ కు ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేసి పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా త‌గ్గించేందుకు కేంద్ర స‌ర్కార్ తీసుకున్న చ‌ర్యను ఈ సంద‌ర్భంగా ముఫ్తీ ట్వీట్ చేశారు.

ప్ర‌స్తుతం మెహ‌బాబూ ముఫ్తీ(Mehbooba Mufti)  చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : ఈ దేశంలో ఎవ‌రైనా రాష్ట్ర‌ప‌తి కావ‌చ్చు

Leave A Reply

Your Email Id will not be published!