Mehbooba Mufti : మోదీ నిర్వాకం దేశానికి ప్రమాదం
ఇలాగే ఉంటే శ్రీలంక పరిస్థితే ఇక్కడ
Mehbooba Mufti : జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీలంకలో చోటు చేసుకున్న ఘటనలను చూసైనా మోదీలో మార్పు వస్తుందనుకున్నామని కానీ ఆయన దేనినీ పట్టించు కోవడం లేదన్నారు.
పెట్రోల్, డీజిల్, ఆహార కొరతతో ఆ దేశం అట్టుడుకుతోందని కానీ ఇక్కడ కొంత మంది చేతుల్లోనే వ్యాపారాలు , సంస్థలు నడుప బడుతున్నాయని దీని వెనుక మోదీ ఉన్నాడని ఆరోపించారు.
పొరుగు దేశంలో తలెత్తిన ఆర్థిక, రాజకీయ సంక్షోభం భారత దేశానికి, ప్రత్యేకించి ప్రధాని మోదీకి కనువిప్పు కావాలని అన్నారు. బుధవారం మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) మాట్లాడారు.
ఈ దేశంలో మైనార్టీలపై దాడులు పెరిగి పోయాయని, రాను రాను బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలతో దేశ ప్రజలు మేల్కోవాలని ఇలాగే జరుగుతూ పోతే దేశం దివాలా తీయడం ఖాయమన్నారు.
దేశంలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి మత వైషమ్యాలు పెరిగి పోయాయని, దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మాజీ సీఎం ఆరోపించారు.
జాతీయ వాదం పేరుతో దారుణాలు చోటు చేసుకుంటున్నా అడిగే నాథుడే లేకుండా పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
ముందస్తుగా మేల్కోక పోతే మన దేశం కూడా శ్రీలంక లాగా జరిగే ప్రమాదం లేక పోలేదని హెచ్చరించారు మెహబూబా ముఫ్తీ సయ్యద్(Mehbooba Mufti).
Also Read : సత్యం పలకడం దేశ ద్రోహం కాదు