Zee SaRiGaMapa : జి సరిగమప 13 వ సీజన్ లో ‘మెంటర్స్ స్పెషల్ ఎపిసోడ్’

Zee SaRiGaMapa : సుస్వరాల వేదిక గా నిల‌చిన జీ తెలుగు స రి గ మ ప. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంద‌రో గాయనీ గాయకులని పరిచయం చేయ‌టం ద్వారా తనదైన మార్కు సంపాదించుకుందన‌టంలో సందేం లేదు.

Zee SaRiGaMapa : సుస్వరాల వేదిక గా నిల‌చిన జీ తెలుగు స రి గ మ ప. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంద‌రో గాయనీ గాయకులని పరిచయం చేయ‌టం ద్వారా తనదైన మార్కు సంపాదించుకుందన‌టంలో సందేం లేదు. ఎన్నో వారాలనుంచి అందరిని అలరిస్తున్న 13 వ సీజన్ కంటెన్స్టెంట్స్ సెమీఫైనల్స్ లో త్వరలో అడుగుపెడుతున్నారు. వారిని ఉత్తేజపరచడం కోసం మెంటర్స్ పృథ్వి, దీపు, రేవంత్, సాకేత్, సోనీ, రఘురామ్, హరిక , దామిని రంగంలోకి దిగారు. ఈ వారం మెంటర్స్ కొన్ని అద్భుతమైన పాటలు పాడి వారిని ప్రోత్సహించనున్నారు. ప్రేక్షకుల్ని కూడా రంజింపచేసేలా సరికొత్త పాటలు పాడి అల‌రించ‌నున్నారు. కేవ‌లం పాటల‌కే ప‌రిమితం కాకుండా, ఎన్నో సరికొత్త విషయాలు , సింగర్ దీపు, తన ప్రేమాయణం ఇలా అంతా త‌మ సంగీత ప్ర‌యాణ‌పు అనుభ‌వాల‌ను మెంటర్స్ పంచుకోనున్నారు. . అలాగే, రేవంత్ తన బ్రేక్అప్ స్టోరీ తో పాటు, సాకేత్ మరియు తనకి ఉన్న స్నేహం, తన జర్నీ గురించి అందరికి వివరించ‌నున్నాడు. , ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్ర‌సారం కానున్న స‌రిగ‌మ‌ప‌లో ఈ విశేషాల‌ను తెలుసుకోవ‌చ్చు.

No comment allowed please