Sajjala Ramakrishna Reddy : భారత దేశపు అత్యున్నత నిర్ణయాధికారం కలిగిన పార్లమెంట్ లో తీర్మానం చేయడం, కొత్త రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయినా ఇంకా సీమాంధ్రుల కోరిక తీరడం లేనట్టుంది. తాజాగా ఏపీ ప్రభత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కుదిరితే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది.
త్వరలో అటు ఏపీలో ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. మరోసారి పవర్ పాలిటిక్స్ కు తెర లేపాయి అన్ని పార్టీలు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ విద్వేషాలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తుండగా అక్కడ వైసీపీ కొత్తగా వితండ వాదానికి తెర లేపింది. ఇంకో వైపు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టారు.
తాను తెలంగాణ బిడ్డనేనని అంటున్నారు. ఈ తరుణంలో ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) విషయం తెలుసుకోకుండా ఎలా వ్యాఖ్యానిస్తారో ఆయనకే తెలియాలి. ఇదిలా ఉండగా మరోసారి తెలంగాణపై నోరు పారేసుకున్నారు. తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు.
అలా అయితే మొదటగా స్వాగతించేది తమ పార్టీనని చెప్పారు. వెలగపూడిలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం అసంబద్దమంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పై విధంగా కామెంట్స్ చేశారు.
పార్లమెంట్ లో తీర్మానం చేసిన తర్వాత దానిని ఇప్పుడు ఏమీ చేయలేమన్నారు.
Also Read : బీఆర్ఎస్ కు ఈసీ లైన్ క్లియర్