Meta Launches Blue Tick : మెటా సబ్ స్క్రిప్షన్ సర్వీస్ స్టార్ట్
ట్విట్టర్ బాటలోనే జుకర్ బర్గ్
Meta Launches Blue Tick : టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ మామూలోడు కాదని ప్రపంచానికి చాటి చెప్పాడు. పక్కా బిజినెస్ మెన్ నని నిరూపించుకున్నాడు. ఎవరూ ఊహించని రీతిలో ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు టేకోవర్ చేసుకున్నాక కీలక నిర్ణయాలు తీసుకుంటూ హోరెత్తిస్తున్నాడు.
ఇప్పటికే 9 వేల మందికి పైగా తొలగించాడు. బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించాల్సిందేనంటూ ఫీజు ఖరారు చేశాడు. ఏడాదికి ఉండాలంటే ఆఫర్ కూడా ప్రకటించాడు. దీంతో మస్క్ బాటలోనే మరికొందరు నడుస్తున్నారు. నీవు నేర్పిన విద్యనే మాకు శిరోధార్యం అంటున్నారు. ఇప్పటికే లే ఆఫ్స్ కు శ్రీకారం చుట్టిన మస్క్ ను ఆదర్శంగా తీసుకున్నాయి మిగతా కంపెనీలు.
వాటిలో జుకర్ బర్గ్ కు చెందిన మెటా ఫేస్ బుక్ , గూగుల్ , మైక్రో సాఫ్ట్ , అమెజాన్ , ఫిలిప్స్ , తదితర కంపెనీలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ సామాజిక దిగ్గజంగా పేరున్న మెటా(Meta) ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్విట్టర్ సబ్ స్కిప్షన్ ను ఇంట్రడ్యూస్ చేసింది.
ఇక నుంచి ఫేస్ బుక్ కూడా తన కస్టమర్ల కోసం వెరిఫైడ్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ ను(Meta Launches Blue Tick) తీసుకు వచ్చింది. ఈ సేవలు పొందాలంటే తప్పనిసరిగా కొంత మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మెటాకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ , వాట్సాప్ , ఫేస్ బుక్ లలో బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సిఇఓ మార్క్ జుకర్ బర్గ్.
Also Read : మస్క్ పై చాట్ జిపిటి కామెంట్స్