MIG 21 Jet Crash : రాజస్థాన్ లో కూలిన మిగ్ -21 జెట్
ఇద్దరు పైలట్లు దుర్మరణం
MIG 21 Jet Crash : రాజస్థాన్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. బార్మర్ లో దేశ వైమానిలిక దళానికి చెందిన మిగ్ -21 జెట్(MIG 21 Jet Crash) కూలి పోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు కోర్టు విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల కుటుంబాలకు అండగా ఉంటామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ప్రకటించింది.
ఈ ఘటన జూలై 28 సాయంత్రం చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ -21 జెట్ శిక్షణ సమయంలో కూలి పోవడంతో అక్కడికక్కడే పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
ఐఏఎఫ్ ట్విన్ సీటర్ మిగ్ 21 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ రాజస్థాన్ లోని ఉతర్లై ఎయిర్ బేస్ నుండి శిక్షణ కోసం విమానంలో ప్రయాణించింది. రాత్రి 9.10 గంటలకు బార్మర్ సమీపంలో విమానం ప్రమాదానికి గురైంది.
ఇద్దరు ప్రాణాలు విడిచారంటూ వైమానిక దళం వెల్లడించింది. ప్రమాద ఘటన జరిగిన వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీ. ఆర్. చౌదరితో మాట్లాడారు.
ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. అనుకోకుండా జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశించామని చౌదరి సింగ్ కు తెలిపారు.
ఇదిలా ఉండగా రాజస్తాన్ బార్కర్ సమీపంలో ఐఏఎఫ్ కి చెందిన మిగ్ -21 ఎయిర్ క్రాఫ్ట్(MIG 21 Jet Crash) ప్రమాదంలో ఇద్దరు వైమానిక యోధులను కోల్పోయినందుకు తవ్ర మనో వేదనకు గురైనట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Also Read : అవసరమైతే కన్నడ నాట యోగి మోడల్