Millions Found : గోటబయ భవనంలో రూ. 17.85 మిలియన్లు
అందజేసిన నిరసకారులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Millions Found : శ్రీలంకను సర్వనాశనం చేసి జనం తిరుగుబాటుతో తప్పించుకుని పారి పోయిన గోటబయ రాజపక్సే ఇప్పుడు సింగపూర్ లో తలదాచుకున్నాడు. అక్కడ తాత్కాలిక వీసా పేరుతో ఉన్నాడు.
ఇదే సమయంలో జనం తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై రాజపక్సే ఉన్న ప్రెసిడెంట్ భవనాన్ని ముట్టడించారు. అక్కడ దొంగతనంగా , అక్రమంగా సంపాదించి, దాచుకున్న డబ్బుల్ని కొందరు నిరసనకారులు అందినంత మేర తీసుకున్నారు.
ఈ సమయంలో జూలై 13న దేశం విడిచి వెళ్లిపోగా రాజ భవనంలో మిగిలిన 17.85 మిలియన్ల శ్రీలంక రూపాయలను స్వాధీనం చేసుకుంది ఆ దేశ ఆర్మీ. ఈ లక్షలాది రూపాయల నగదును(Millions Found) శ్రీలంక పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు.
జూలై 9న వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు కొలంబోలోని హై సెక్యూరిటీ ఫోర్డ్ ఏరియా లోని ఆనాటి అధ్యక్షుడి నివాసాన్ని బారికేడ్లను బద్దలు కొట్టి ఆక్రమించారు.
మాల్దీవుల్ కు పారి పోయాక ఈమెయిల్ ద్వారా తను రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. నిరసనకారులు 17.85 మిలియన్ల శ్రీలంక రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత వాటిని పోలీసులకు అప్పగించారు. కొలంబో సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి బాధ్యత వహించే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు చేసిన ఆదేశం మేరకు శుక్రవారం పోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టుకు డబ్బుల్ని అందజేసినట్లు న్యూ ఫస్ట్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా డబ్బులు అందించడంలో జరిగిన జాప్యంపై తక్షణమే విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను ఆదేశించారు. (Courtsy by PTI )
Also Read : అమెరికాతో యుద్దానికి ‘కిమ్’ సై