Owaisi : నితీశ్ కుమార్..దీదీకి అంత సీన్ లేదు

నిప్పులు చెరిగిన ఎంఐఎం చీఫ్ ఓవైసీ

Owaisi :  ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ(Owaisi) షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024లో ప్ర‌తిప‌క్షాల‌న్నీ కలిసి బీజేపీకి వ్య‌తిరేకంగా యుద్దం చేస్తాన‌ని ప్ర‌క‌టించడాన్ని ఎద్దేవా చేశారు.

శ‌నివారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీల‌కు(Mamata Banerjee) అంత సీన్ లేద‌న్నారు.

వాళ్లు ఏ ఒక్క మాట మీద ఉండ‌ద‌ర‌ని మండిప‌డ్డారు ఓవైసీ. దేశాన్ని అప్పులపాలు చేసిన ఘ‌న‌త ప్ర‌ధాని మోదీకి ద‌క్కుతుంద‌న్నారు. రాబోయే 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో వీరంతా క‌ల‌లు కంటున్నార‌ని కానీ వారి వ్యూహాలు వ‌ర్క‌వుట్ కాద‌న్నారు ఓవైసీ.

సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా బ‌ల‌హీన‌మైన ప్ర‌ధాన మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టినా క‌నీసం దేశంలోని బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన వారి కోసం ఏదైనా చేస్తామంటూ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.

లౌకిక వాదానికి ద్రోహం చేస్తున్నార‌ని జాతీయ అగ్ర నాయ‌కుల‌ను త‌రచుగా ఆరోపిస్తున్న నితీశ్ కుమార్(Nitish Kumar) త‌న తాజా వ్యాఖ్య‌ల‌లో లక్ష్యంగా చేసుకున్నారు.

బీహార్ సీఎం తాను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావ‌డం లేద‌న్నారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉన్న‌ప్పుడు బీహార్ రాష్ట్రానికి సీఎం అయ్యాడు.

గుజ‌రాత్ లోని గోద్రా హింస చెల‌రేగిన‌ప్పుడు కూడా ఆయ‌న ఆ పార్టీకి స‌పోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు లౌకిక వాదం అంటూ ముందుకు రావ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు ఓవైసీ(Owaisi).

2015లో వారిని విడిచి పెట్టాడు. 2017లో మ‌ళ్లీ చేరాడు. 2019లో మోదీని గెలిపించేందుకు ముగించాడ‌ని ఎద్దేవా చేశారు. ఇక మ‌మ‌తా బెన‌ర్జీ గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌న్నారు.

Also Read : గేమింగ్ యాప్ కేసులో ఈడీ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!