Owaisi KCR : ఓవైసీ కామెంట్స్ కలకలం
సీఎం కేసీఆర్ పై గుస్సా
Owaisi KCR : నిన్నటి దాకా భాయ్ భాయ్ అని ప్రకటిస్తూ వచ్చిన ఎంఐఎం ఉన్నట్టుండి స్వరం మార్చింది. ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) సంచలన కామెంట్స్ చేశారు. తమ గురించి అస్సలు కేసీఆర్(KCR) పట్టించు కోవడం లేదని ఆరోపించారు. త్వరలో ఎన్నికలు రానున్నాయి. దీంతో ఒంటరిగా పోటీకి దిగనున్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. 19 చోట్ల పతంగ్ పార్టీకి ఓటు బ్యాంకు ఉందన్నారు. ఎంఐఎం గత కొంత కాలంగా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులపై ప్రభావం చూపుతోంది. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందన్నారు.
ఆదిలాబాద్ లో ఇటీవల జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో పాల్గొన్న ఎంఐఎం చీఫ్ ఓవైసీ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ముస్లింల సంక్షేమం కోసం పని చేయడం లేదని ఆరోపించారు. రూ. 1,200 కోట్లు ఖర్చు చేసి యాదాద్రి ఆలయాన్ని, బ్రాహ్మణ సదన్ కట్టేందుకు ఖర్చు చేశారని మండిపడ్డారు. కానీ ముస్లింల కోసం ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పి మరిచి పోయారంటూ ధ్వజమెత్తారు.
తమ వర్గంతో ఓట్లు పొందిన వారు తమ గురించి పట్టించు కోక పోవడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ , అంబర్ పేట్ , ముథోల్ , రాజేంద్ర నగర్ , నిర్మల్ , ఆదిలాబాద్ , ఖానాపూర్ , నిజామాబాద్ , కామారెడ్డి, బోధన్ , కరీంనగర్ , జగిత్యాల, మహబూబ్ నగర్ , వరంగల్ ఈస్ట్ , ఖమ్మం సహా పలు నియోజకవర్గాలో ముస్లిం కమ్యూనిటీ బలంగా ఉంది. ఇక్కడ పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఓవైసీ.
Also Read : Ambati Rambabu