Minister Komatireddy : హరీష్ రావు కేసీఆర్ ని వదిలిపెట్టి వస్తే సపోర్ట్ చేస్తాం – కోమటిరెడ్డి

హరీశ్ రావు పార్టీ ఎల్పీ నేత కూడా కాదని, 20 మందితో ఆ పార్టీ అధినేత కావాలని సవాల్ విసిరారు

Minister Komatireddy : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్లమెంటు లాబీలో మంత్రి మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ లకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని.. హరీష్ రావు సీఎం కావాలనే ఆలోచనలో ఉన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ని వ్యతిరేకించి వస్తే మద్దతిస్తామని చెప్పారు. కవిత, హరీష్, కేటీఆర్ అంటూ పార్టీ చీలిపోతుందని వ్యాఖ్యానించారు. అప్పుడు బీఆర్‌ఎస్‌లో నాలుగు పార్టీలు ఉంటాయన్నారు.

Minister Komatireddy Comments on Harish Rao

హరీశ్ రావు పార్టీ ఎల్పీ నేత కూడా కాదని, 20 మందితో ఆ పార్టీ అధినేత కావాలని సవాల్ విసిరారు. కట్టే పట్టుకొని తిరిగితే కేసీఆర్ పులి ఎలా అవుతాడని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. 60 కిలోల బరువున్న వ్యక్తి పులి అయితే, తాను 86 కిలోల బరువున్న వ్యక్తిని తనేం కావాలని కామెంట్ చేసారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Vladimar Putin : క్యాన్సర్ ను నివారించే దిశగా రష్యా..కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్

Leave A Reply

Your Email Id will not be published!