KTR : అమెరికా టూర్ కు కేటీఆర్

ప‌ది రోజుల పాటు ప‌ర్య‌ట‌న

KTR America Tour : తెలంగాణ రాష్ట్ర ఐటీ (Telangana State IT), పుర‌పాలిక శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు – కేటీఆర్ (KTR America Tour) అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు (Municipal Minister). రాష్ట్రంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షణే ల‌క్ష్యంగా ఈ టూర్ చేస్తారు.

కేటీఆర్ సార‌థ్యంలోని బృందం ప‌ది రోజుల పాటు అమెరికాలో ప‌ర్య‌టించ‌నుంది. యూఎస్ఏ లోని ప్ర‌ముఖ పేరొందిన కంపెనీల‌తో స‌మావేశం అవుతారు. లాస్ ఏంజిల్స్ లో ప్రారంభం అవుతుంది.

ఈనెల 20న శాండియాగో, 21న శాన్ జోస్ , 24న బోస్ట‌న్ , 23న న్యూయార్క్ లో కొన‌సాగుతోంది. ఆయా కంపెనీల‌కు చెందిన చైర్మ‌న్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ల‌ను క‌లుసుకుంటారు.

వారితో ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతారు. రాష్ట్రంలో కొన‌సాగుతున్న అభివృద్ధి గురించి తెలియ చేస్తారు. ఇప్ప‌టికే దేశంలో ఎక్క‌డా లేని విధంగా (Telangana government) ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ పాలసీని తీసుకు వ‌చ్చింది.

పెట్టుబ‌డిదారుల‌కు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అనుగుణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పాల‌సీని తీసుకు వ‌చ్చింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వెంట‌నే 15 రోజుల లోపే కంపెనీలు ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని క‌ల్పించింది.

ఈ విధానం దేశంలో ఎక్క‌డా లేదు. నిరంత‌రం 24 గంట‌ల పాటు నీటి వ‌స‌తి, విద్యుత్ స‌ర‌ఫ‌రా అంద‌జేస్తోంది. గ‌తంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు లేవు.

ఎలాంటి పైర‌వీల‌కు ఆస్కారం లేకుండా క‌ట్టుదిట్ట‌మైన పాల‌సీని తీసుకు రావ‌డంతో పెట్టుబ‌డి దారులు క్యూ క‌డుతున్నారు తెలంగాణ‌కు. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో పేరొందిన దిగ్గ‌జాలు కొలువు తీరాయి.

ఇదిలా ఉండ‌గా కేటీఆర్ (KTR America Tour) వెంట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్రంజ‌న్, లైఫ్ సైన్సెస్ డైరెక్ట‌ర్ శ‌క్తి నాగ‌ప్ప‌న్ ఉన్నారు.

Also Read : ద‌మ్ముంటే గంగుల‌పై పోటీకి దిగు

Leave A Reply

Your Email Id will not be published!