Minister KTR : బీఆర్ఎస్ కు 80 సీట్లు పక్కా
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణలో ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి భారీ విజయాన్ని సాధించడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంగళవారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.
Minister KTR Comment
మొత్తం 119 స్థానాలలో తమ పార్టీకి కనీసం 80 కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. మరోసారి ముచ్చటగా సీఎం కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు.
తన తండ్రికి అపారమైన రాజకీయ అనుభవం ఉందని, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం ఖాయమని పేర్కొన్నారు కేటీఆర్. ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
ఇవాళ తెలంగాణ సర్కార్ ఆచరిస్తోందని కానీ భారత దేశం, ఇతర రాష్ట్రాలలో తమను అనుసరిస్తున్నాయని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్, బీజేపీలు కేవలం 10, 5 స్థానాలకే పరిమితం కావడం ఖాయమన్నారు. ప్రజలు ఈ దొంగ పార్టీలను నమ్మడం లేదన్నారు.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ