KTR : సుకేష్ ఆరోపణలు అబద్దం – కేటీఆర్
ఆధారాలు లేకుండా విమర్శలు వద్దు
KTR : మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుకేశ్ చంద్రశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్ పై. ఆయన చేసిన విమర్శలను , కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నారు ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్(KTR). ట్విట్టర్ వేదికగా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
సుకేష్ చంద్రశేఖర్ ను భ్రమలు కలిగించే మోసగాడు అంటూ మండిపడ్డారు. అవినీతి, ఆరోపణలతో ఇప్పటికే జైలు కూడు తింటున్నాడు. తను పదే పదే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై కొన్నిహాస్యాస్పదమైన ఆరోపణలు చేసినట్లు తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు.
ఈ సుకేష్ చంద్రశేఖర్ అనే పోకిరీ గురించి ఎన్నడూ విన లేదన్నారు కేటీఆర్. పదే పదే అర్థం పర్థం లేని మాటలతో ఎవరిని పడితే వారిపై కీలక నిరాధార ఆరోపణలు చేయడం అలవాటుగా చేసుకున్నాడని ఫైర్ అయ్యారు.
సుకేష్ చంద్రశేఖర్ ఎవరో, అతడి నేర చరిత్ర ఏమిటో మీడియాకు తెలుసు. తనపై నిరాధార విమర్శలు చేసినప్పుడు మీడియా కూడా తన పరిమితులు ఏమిటో తెలుసుకుని ప్రచురించాలని సూచించారు. ఏది ఏమైనా సుకేష్ చంద్రశేఖర్ ను తాను నమ్మబోనంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సుకేష్ ఏకంగా గవర్నర్ తమిళి సైకి లేఖ రాశారు. కేటీఆర్ తో పాటు కవిత పై కూడా ఆరోపణలు చేయడం విశేషం.
Also Read : ISRO Chairman : చంద్రయాన్-3 సక్సెస్ – ఇస్రో చీఫ్