Minister KTR : ఫలితాల పట్ల బాధ లేదు – కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్ . ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తమ పార్టీ పట్ల ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Minister KTR Comment After BRS Loosing
వరుసగా రెండుసార్లు గెలిపించారని, తమకు అధికారాన్ని కట్టబెట్టారని ఇందుకు థ్యాంక్స్ తెలిపారు కేటీఆర్. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పు తనకు ఎలాంటి బాధ కలిగించ లేదని తెలిపారు. ఇది ఆశించిన స్థాయిలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించక పోవడం కొంత నిరాశకు గురి చేసిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
ఈ మొత్తం ఫలితాలపై పునరాలోచించు కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు కేటీఆర్(Minister KTR). దీనిని ఒక పాఠంగా తీసుకుంటామని, తిరిగి పుంజు కుంటామని తెలిపారు. అయితే ఎన్నికల్లో విక్టరీ నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీ తరపున అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మేం నిర్ణయాత్మక , ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని , ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ సర్కార్ ను వాచ్ డాగ్ లాగా చూస్తూ ఉంటామని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి.
Also Read : Chandra Babu Naidu Congrats : కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ – బాబు </b.