KTR Drivers : నిన్న డ్రైవర్లు నేడు ఓనర్లు – కేటీఆర్
దళిత బంధుతో బతుక్కి భరోసా
KTR Drivers : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల వారీగా లబ్దిదారులను ఎంపిక చేసింది. మంజూరైన ఆర్థిక సాయంతో తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే మరికొందరు వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.
తాజాగా నిన్నటి దాకా డ్రైవర్ గా పని చేస్తూ ఉన్న వ్యక్తి ఏకంగా బస్సుకు ఓనర్ కావడం మామూలు విషయం కాదు. ఇందుకు సంబంధించి దళితబంధు పథకం ద్వారా ఎంపికై ఏకంగా బస్సును కొనుగోలు చేసిన విషయం తెలుసుకున్న తెలంగాణ ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
డ్రైవర్ పని చేస్తూ ఓనర్ దాకా ఎదిగిన వేములవాడ నియోజకవర్గం చందుర్తి గ్రామానికి చెందిన రాగుల సాగర్, నేరెళ్ల శేఖర్ లను ప్రత్యేకంగా కేటీఆర్ అభినందనలతో ముంచెత్తారు. ఇలాంటి ఆంట్రప్రెన్యూర్లు రాష్ట్రానికి కావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది దళితులు ఇవాళ ఆదర్శ ప్రాయంగా మారుతున్నారని కితాబు ఇచ్చారు.
Also Read : MLA Jagga Reddy : నా వద్ద డబ్బులు లేవు – జగ్గా రెడ్డి