Minister KTR : మెట్రో విస్తరణపై కేటీఆర్ ఫోకస్
రైల్ మాస్టర్ ప్లాన్ పై సమీక్ష
Minister KTR : హైదరాబాద్ లో రద్దీ నివారణ, మెరుగైన రవాణాకు సంబంధించి మెట్రో రైల్ ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగర భవిష్యత్తు కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరమని పేర్కొన్నారు. కాలుష్యం కూడా తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు కేటీఆర్.
Minister KTR – Ruling Through Development
విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలని స్పష్టం చేశారు మంత్రి. వేగంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ వే పై ప్రత్యేకంగా చర్చించారు . ఇందు కోసం అవసరమైన 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని జీఎంఆర్ సంస్థను ఆదేశించారు.
అంతకంతకూ విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రద్దీని , కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు కేటీఆర్(KTR). ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి భారీ పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు.
Also Read : MLC Kavitha : బరిలోకి దిగుతా బరాబర్ ఓడిస్తా