Minister KTR : పువ్వాడకు కేటీఆర్ ఖుష్ కబర్
ఖమ్మం కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు
Minister KTR : హైదరాబాద్ – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు తీపి కబురు చెప్పారు. ఖమ్మం జిల్లాకు ఊహించని రీతిలో మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. తనను కలిసిన పువ్వాడను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మంత్రిగా పూర్తయి నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విస్తు పోయేలా చేశారు కేటీఆర్.
Minister KTR Said Good News
ఖమ్మం కార్పొరేషన్ అభివృద్దికి ఏకంగా రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వుల పత్రాన్ని స్వయంగా కేటీఆర్(Minister KTR) పువ్వాడ అజయ్ కుమార్ కు అందజేశారు. తనపై ప్రేమ కురిపించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు .
ఇదిలా ఉండగా తాజాగా బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలను పురస్కరించుకుని 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో 115 మందిని ప్రకటించగా అత్యధికంగా సిట్టింగెల్ కే ఈసారి ఛాన్స్ ఇస్తూ వచ్చారు. కాగా 7 మందికి మంగళం పాడారు. వారిలో తాడికొండ రాజయ్య కూడా ఉన్నారు.
తొలి జాబితాలో మంత్రి పువ్వాడకు కూడా సీటు దక్కింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మొత్తం ఆయన కనుసన్నలలో నడుస్తోంది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ప్రస్తుతం కొలువుతీరారు. మంత్రి కేటీఆర్ తో దగ్గరి సంబంధం ఉంది పువ్వాడకు.
Also Read : R Krishnaiah : కవితకు కృష్ణయ్య కితాబు