KTR : పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వం వసతులను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి కేటీఆర్(KTR). ఇప్పటికే ఐటీ, ఫార్మా, అగ్రి, రియాల్టీ హబ్ గా మారిందన్నారు.
ప్రంపచంలోని దిగ్గజ కంపెనీలన్నీ ఫస్ట్ ప్రయారిటీ హైదరాబాద్ కే ఇస్తున్నాయని చెప్పారు. గతంలో ఇండియా అంటే ఐటీ అనగానే ముందుగా బెంగళూరు గుర్తుకు వచ్చేదని కానీ సీన్ మారిందన్నారు.
ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం దేశానికే ఆదర్వంగా నిలిచిందన్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని చెప్పారు కేటీఆర్(KTR).
అంతే కాకుండా మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ నగరం ముందుందని వెల్లడించారు. ఇదే సమయంలో నివాస యోగ్యమైన సిటీలలో కూడా భాగ్యనగరం టాప్ లో ఉందన్నారు.
తాజాగా రాయదుర్గలో ఉన్న నాలెడ్జ్ సెంటర్ లో అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ సంస్థ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనిని గురువారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. అమెరికాలో ఏర్పాటైన ఈ సంస్థ ఎక్కడా లేని విధంగా సిటీని ఎంచు కోవడం సంతోషంగా ఉందన్నారు. ఎవరు వచ్చినా తాము ప్రోత్సహిస్తూనే ఉంటామన్నారు కేటీఆర్.
డిజిటల్ టెక్నాలజీకి రాను రాను డిమాండ్ పెరగుతోందన్నారు. ప్రస్తుతం డిజి టెక్ కంపెనీలు చాలా ఉన్నాయని చెప్పారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది.
ఆ సంస్థ హైదరాబాద్ లో ఆఫీసు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇదిలా ఉండగా 350 మందికి పైగా ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు.
Also Read : అత్యంత విలువైన కంపెనీగా సౌదీ అరామ్కో