KTR : విజ‌యం ఖాయం మాదే రాజ్యం – కేటీఆర్

సీఎంగా కేసీఆర్ అవ‌డం ఖాయం..జోష్యం

KTR : మొత్తంగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ ముంద‌స్తుకు పోవ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. ఇప్ప‌టికే ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం, ప్రారంభోత్స‌వాలు చేయ‌డం జ‌రుగుతోంది వ‌డివ‌డిగా. మొన్న‌టికి మొన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో అంద‌రికీ దిశా నిర్దేశం చేశారు గులాబీ బాస్ కేసీఆర్. సిట్టింగ్ ల‌కే సీట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.

కానీ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌ర్చుకోవాల‌ని సూచించారు. పైకి ముంద‌స్తుకు వెళ్ల‌నంటూ చెప్ప‌క పోయినా రాజ‌కీయ వాతావ‌ర‌ణం చూస్తుంటే త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగేలా క‌నిపిస్తున్నాయి. ఇందుకు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత బ‌లాన్ని క‌లిగించేలా చేస్తున్నాయి.

తెలంగాణ‌లో మ‌ళ్లీ వ‌చ్చేతి తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వ‌మేన‌ని, మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు కేటీఆర్. మంగ‌ళ‌వారం ఎల్బీన‌గ‌ర్ లో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు మంత్రి ప్రారంభోత్స‌వం చేశారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఎల్బీ న‌గ‌ర్ నుంచి హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రోను విస్త‌రిస్తామ‌ని చెప్పారు కేటీఆర్(KTR). ఆ దిశ‌గా ప్ర‌జా ర‌వాణాకు ఇబ్బంది లేకుండా చేస్తామ‌న్నారు.

అంతే కాకుండా టిమ్స్ ఆస్ప‌త్రి గ‌డ్డి అన్నారంలో రాబోతోంద‌ని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్క‌డా లేని విధంగా అభివృద్ది ప‌నులు తెలంగాణ‌లో చేప‌ట్టిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని పేర్కొన్నారు.

Also Read : క‌విత యూట‌ర్న్ నేను ఫుల్ బిజీ

Leave A Reply

Your Email Id will not be published!