Minister KTR : త్వ‌ర‌లో ఆస‌రా పెన్ష‌న్ల పెంపు

ప్ర‌క‌టించిన మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల జ్వ‌రం మొద‌లైంది. త్వ‌ర‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించ‌నుంది. దీంతో అన్ని పార్టీలు హామీల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ మ‌ధ్య పోరు అధిక‌మైంది. ఈ త‌రుణంలో శ‌నివారం జ‌రిగిన స‌మావేశంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

Minister KTR Comment about New Scheme

త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆస‌రా పెన్ష‌న్లు తీసుకుంటున్న వారికి తీపి క‌బురు సీఎం కేసీఆర్ చెప్ప బోతున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం పెన్ష‌న్లు తీసుకుంటున్న వారికి పెంచేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు.

అధికారికంగా బీఆర్ఎస్ బాస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు ప్ర‌జ‌ల సాక్షిగా ప్ర‌క‌టిస్తార‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్(Minister KTR). దేశంలో ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు జ‌రుగుతున్నాయ‌ని, కానీ ప్ర‌తిప‌క్షాలు నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

ఇవాళ ఐటీ , లాజిస్టిక్, ఫార్మా, టెలికాం , స్టార్ట‌ప్ రంగాల‌లో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌న్నారు. ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీలు ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కు క్యూ క‌డుతున్నాయ‌ని చెప్పారు. అభివృద్దిని చూసి ఓర్వ‌లేని వారే విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు మంత్రి కేటీఆర్.

Also Read : Kalva Sujatha : కాంగ్రెస్ నేత కాల్వ సుజాత కంట‌త‌డి

Leave A Reply

Your Email Id will not be published!