Minister KTR : మేమే గెలుస్తం మాదే రాజ్యం
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – ఐటీ పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము గెలవడం ఖాయమని , తమదే రాజ్యమని ప్రకటించారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ పార్టీ పరంగా అధినేత సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని స్పష్టం చేశారు.
Minister KTR Comment
119 సీట్లకు గాను ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా బీ ఫారమ్ లు ఇచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు కేటీఆర్(Minister KTR). ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నంత రాజకీయ పరమైన అవగాహన ఇంకే నాయకుడికి లేదన్నారు.
60 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు కేటీఆర్. విచిత్రం ఏమిటంటే తాము ఇదివరకే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందన్నారు . ఇవాళ ఐటీ పరంగా దేశంలో టాప్ లో నిలిచిందన్నారు. దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని ఇది కేసీఆర్ పాలన వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు మంత్రి.
ఇప్పటి వరకు 2 లక్షల నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. చాలా మందికి జాబ్స్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
Also Read : Jupally Krishna Rao : జూపల్లి ఎంపికపై గరం గరం