Minister KTR : రుణ మాఫీపై అసెంబ్లీలో ప్రకటన
మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Minister KTR : త్వరలో తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇదే సమయంలో కీలక ప్రకటన చేసింది సర్కార్. ఈ మేరకు గత కొంత కాలంగా ఆర్టీసీపై మౌనంగా ఉన్న ప్రభుత్వం ఉన్నట్టుండి తీపి కబురు చెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు.
Minister KTR Said
ఇదే సమయంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తారా అన్న దానికి తినబోతు రుచులు ఎందుకని అన్నారు. అన్నీ ఒక్కసారి చెబితే వాటికి అంత విలువ ఉండదన్నారు కేటీఆర్. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని సీఎం కేసీఆర్ కీలకమైన ప్రకటన చేయబోతారని జోష్యం చెప్పారు.
మొత్తంగా జరిగే అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ ఒక్కసారి డిసైడ్ అయితే ఆయన ఎవరి మాట వినడు..అసలు తన మాటే వినడని ఓ ప్రచారం ఉంది. మరి రైతులకు రైతు బంధుతో పాటు రుణాలను కూడా మాఫీ చేస్తే ఓట్లు రాలడం ఖాయమంటున్నారు పార్టీ శ్రేణులు.
Also Read : G Kishan Reddy : కాంగ్రెస్..బీఆర్ఎస్ ఒక్కటే