Minister KTR : నా జీవితంలో మందు పోయ లేదు..పైసలు పంచ లేదన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన. నాపై ప్రేమ కురిపించిండ్రు. నన్ను ఆదరించిండ్రు. ఓట్లు అనంగనే చాలా మంది మందు పోస్తరు, పైసలు పంచుతరు. కానీ నేను అట్ల చేయలేదన్నారు కేటీఆర్.
Minister KTR Said
నేను చిల్లర రాజకీయం చేయను. నాలుగు సార్లు కొట్లాడితే నాలుగు సార్లు నన్ను గెలిపించిండ్రు. ఒక తమ్ముడిగా, ఒక అన్నగా మీరు అది అడిగినా పని చేస్తా..ఇంకా చేస్తూనే ఉంటానని అన్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
మీ దయ, ఆదరాభిమానాలు ఉంటే మళ్లీ గెలుస్తా, లేక పోతే ఇంట్లో కూర్చుంటానని చెప్పారు. పని చేసే ప్రభుత్వాలను గుర్తించాలి. వారిని ఆదరించాలి..గెలిపించాలని విన్నవించారు కేటీఆర్. ఇక నుంచి ప్రజలందరికీ అండగా ఉంటానని మరోసారి మాటిస్తున్నానని అన్నారు ఐటీ శాఖ మంత్రి.
ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ(BRS Party) చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. దీంతో గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. విస్తృతంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు కేటీఆర్.
Also Read : Revanth Reddy KCR : కేసీఆర్ పై రేవంత్ గుస్సా