KTR Satya Nadella : సత్య నాదెళ్లతో కేటీఆర్ ములాఖత్
బిజినెస్, బిర్యానీ గురించి ప్రస్తావన
KTR Satya Nadella : మైక్రోసాఫ్ట్ సిఇఓ, చైర్మన్ సత్య నాదెళ్లను కలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో భేటీ అయ్యారు. భారత్ కు ఎలాంటి సాయం చేసేందుకైనా తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
అనంతరం దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలుసుకున్నారు సత్య నాదెళ్ల. ఈ సందర్భంగా చాలా సేపు వీరిద్దరి మధ్య చర్చలు చోటు చేసుకున్నాయి. ప్రధాన అంశాలు చర్చకు వచ్చినట్లు సత్యనాదెళ్ల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్ డెవలప్ మెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలిపారు.
దేశానికి సాంకేతికత పరంగా సహాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు సత్యనాదెళ్ల. ఇదిలా ఉండగా మైక్రో సాఫ్ట్ సిఇఓ, చైర్మన్ ను కేటీఆర్(KTR Satya Nadella) మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తామిద్దరి మధ్య బిజినెస్ , హైదరాబాద్ బిర్యానీ గురించిన చర్చ ప్రధానంగా వచ్చిందని తెలిపారు కేటీఆర్.
బెంగళూరు వేదికగా జరిగిన రెడీ టెక్నాలజీ సమ్మిట్ లో చాట్ జీపీటీ అనే ఏఐ ఆధారిత ఛాట్ రోబోను పరిచయం చేశారు సత్యనాదెళ్ల. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం తెలుగు వాళ్లమని ఇలా మరోసారి కలుసు కోవడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.
Also Read : ఇండిగో సిఇఓ షాకింగ్ కామెంట్స్