Minister KTR : హైదరాబాద్ లో నాఫ్కో భారీ ఇన్వెస్ట్
రూ. 700 కోట్లతో తయారీ కర్మాగారం
Minister KTR : హైదరాబాద్ కు మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో ఫైర్ సేఫ్టీ ఎక్విప్ మెంట్స్ తయారీలో పేరు పొందిన నాఫ్కో కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మంగళవారం దుబాయ్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్ తో నాఫ్కో సంస్థ చీఫ్ భేటీ అయ్యారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్ మెంట్ లో గ్లోబల్ లీడర్ గా ఉన్న తమ సంస్థ హైదరాబాద్ లో భారీ ఎత్తున తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
Minister KTR Bring Again News Industry
ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా నాఫ్కో ఏకంగా రూ. 700 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనుంది. ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని స్థాపించేందుకు గాను హైదరాబాద్ లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తో సహకరించేందుకు కూడా ఒప్పుకున్నారు.
ఈ విషయాన్ని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) వెల్లడించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని మంత్రి పంచుకున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడంతో పాటు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు ఈ సందర్బంగా నాఫ్కో చీఫ్ కు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. ఈ సంస్థ ఏర్పాటుతో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : Madhu Yashki Goud : ఆ పోస్టర్ల వెనుక భారీ కుట్ర