Minister KTR Praise : అంజ‌న్న‌ను కొట్టేటోడు లేడు – కేటీఆర్

ఐటీ, పురపాలిక శాఖ మంత్రి

Minister KTR Praise : షాద్ న‌గ‌ర్ – ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో షాద్ న‌గ‌ర్ లో ప‌లు అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్(Minister KTR) ప్ర‌సంగించారు.

Minister KTR Praise Anjaiah Yadav

ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అంజ‌య్య యాద‌వ్ అద్భుతంగా ప‌ని చేశాడ‌ని కితాబు ఇచ్చారు. ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు షాద్ న‌గ‌ర్ కు ఎమ్మెల్యేగా ఉంటాడ‌ని ఆయ‌న‌ను కొట్టేటోడు లేడ‌ని ప్ర‌శంసల‌తో ముంచెత్తారు.

తాను ఇన్నేళ్ల కాలంలో షాద్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఏమేం చేసిండో ఏకంగా పోస్ట‌ర్లు కూడా ప్ర‌చురించాడ‌ని , ఇది ఇంటింటికీ తిరిగి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర‌లోనే ఉన్నా అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉండేద‌న్నారు.

కానీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. షాద్ న‌గ‌ర్ అన్ని రంగాల‌లో టాప్ లో కొన‌సాగుతోంద‌న్నారు. ఇక‌నుంచి బ‌ట్టేబాజ్ మాట‌లు మాట్లాడే వారి మాట‌లు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు మంత్రి కేటీఆర్.

Also Read :  IT Raids Maganti Gopinath : మాగంటి ఇంట్లో ఐటీ సోదాలు

Leave A Reply

Your Email Id will not be published!