KTR : మ‌త‌త‌త్వ శ‌క్తుల ప‌ట్ల జ‌ర భ‌ద్రం – కేటీఆర్

ప్ర‌జ‌ల్ని విభ‌జించే రాజ‌కీయాలు వ‌ద్దు

KTR : మ‌త‌త‌త్వ శ‌క్తుల ప‌ట్ల రాష్ట్రంలో ప్ర‌జ‌లు జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు మంత్రి కేటీఆర్(KTR). ప్ర‌ధానంగా అల్ల‌ర్లు సృష్టించి అశాంతి క‌లిగించేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

త‌మ రాజ‌కీయ ల‌బ్ది కోసం అస‌లైన చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌ధానంగా బీజేపీని టార్గెట్ చేశారు.

జాతీయ స‌మైక్య‌త‌కు సంకేతికంగా నిలిచే సెప్టెంబ‌ర్ 17ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు కేటీఆర్. త‌మ స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌శాంతంగా ఉన్న ప్రాంతాన్ని అల్ల‌క‌ల్లోలం చేసేందుకు య‌త్నిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి.

వ‌జ్రోత్స‌వాల‌లో పాల్గొని ప్రసంగించారు. ప్ర‌జ‌లు ఏమ‌రుపాటుగా ఉండ‌క పోతే తీవ్రంగా న‌ష్ట పోతార‌ని హెచ్చ‌రించారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక రాష్ట్రాన్ని అన్ని రంగాల‌లో ముందుకు తీసుకు వెళ్లామ‌ని చెప్పారు.

యావ‌త్ దేశం గ‌ర్వ ప‌డేలా త‌న‌ను తాను మ‌ల్చుకుంద‌న్నారు. అన్ని రంగాల‌లో తెలంగాణ టాప్ లో ఉంద‌న్నారు. చివ‌ర‌కు బీజేపీ కొలువు తీరిన గోవా స‌ర్కార్ కూడా మ‌న ఐటీ పాల‌సీని మెచ్చుకునే స్థాయికి చేరింద‌న్నారు.

ఒక‌ప్పుడు ఐటీ అంటే బెంగ‌ళూరు అనే వార‌ని కానీ సీన్ మారింద‌ని అన్నారు. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం హైద‌రాబాద్ వైపు చూస్తోంద‌ని ఆ ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్(KTR).

తెలంగాణ తీసుకు వ‌చ్చిన మార్పుల‌ను చూసి యావ‌త్ దేశం త‌మ వైపు చూస్తోంద‌ని చెప్పారు కేటీఆర్. కొంద‌రు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. తెలంగాణ స‌మాజం రాచ‌రిక వ్య‌వ‌స్థ నుంచి ప్ర‌జాస్వామిక స్వేచ్ఛ వైపు మ‌ళ్లింద‌న్నారు కేటీఆర్.

Also Read : ఆనాటి త్యాగాల ఫలిత‌మే నేటి దేశం -కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!