Minister KTR : రూ. 50 లక్షల బెడ్ రూమ్ పేదలకు ఫ్రీ
డబుల్ బెడ్ రూమ్ ల ధర రూ. 9,100
Minister KTR : హైదరాబాద్ – రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ను ఉచితంగా పేదల కోసం ఇస్తున్నామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష చేపట్టారు.
Minister KTR Speech
ఇటీవలే దుబాయ్ టూర్ ముగించుకుని వచ్చిన కేటీఆర్(Minister KTR) పనుల ప్రగతిపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో తీసుకు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారత దేశంలో ఎక్కడా లేదన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించడం జరిగిందన్నారు కేటీఆర్.
ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ధర రూ. 50 లక్షలు అని , ఇప్పటి వరకు మొత్తం రూ. 9,100 కోట్లు ఖర్చు చేసి డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించడం జరుగుతోందన్నారు మంత్రి. అయితే వీటి మార్కెట్ విలువ రూ. 50,000 కోట్లకు పైగా ఉంటుందన్నారు కేటీఆర్.
తొలి దశ కింద 11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేసినట్లు చెప్పారు. ఈనెల 21న రెండో దశ కింద 13,300 ఇండ్లను ఇస్తున్నట్లు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పేదలకు వీటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : Anjan Kumar Yadav : అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్