Minister KTR : మేం గెలుస్తం మాదే అధికారం
ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ – రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి పక్కా గులాబీ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు మంత్రి కేటీఆర్(Minister KTR). శనివారం ఆయన మీట్ ది ప్రెస్ లో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గతంలో లేనంతగా తెలంగాణ ఒంటరి పోరాటం చేసిందన్నారు.
Minister KTR Comments Viral
ఓ వైపు కేంద్రం సహకకరించక పోయినా అన్ని రాష్ట్రాలను తల దించుకునేలా అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందన్నారు. దీనికి ప్రధాన కారణం విజన్ ఉన్న ఏకైక నాయకుడు, బీఆర్ఎస్ బాస్, తమ అధినేత సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమైందన్నారు కేటీఆర్.
గ్యారెంటీ హామీలతో కర్ణాటకలో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేయలేక చతికిల పడిందంటూ ఆరోపించారు. ఇక్కడ ఆరు గ్యారెంటీలు బక్వాస్ అంటూ కొట్టి పారేశారు మంత్రి. కాంగ్రెస్ చేసిన పాపం వల్లనే తెలంగాణ గత 58 ఏళ్లుగా ఎనలేని దోపిడీకి లోనైందని ఆరోపించారు.
119 స్ఠానాలకు గాను 100 స్థానాలలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని రీతిలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిందని చెప్పారు. జనం ఫిదా అవుతున్నారని 100 సీట్లు పక్కా గెలుస్తామన్నారు కేటీఆర్.
Also Read : Pawan Kalyan : లెజీనోవాతో పవన్ ఇటలీకి