Minister KTR : సీఎం హ్యాట్రిక్ కొట్టడం ఖాయం – కేటీఆర్
ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి
Minister KTR : ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా చివరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడం ఖాయమన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. మూడో సారి గెలిచి దక్షిణ భారత దేశంలో రికార్డు సృష్టించబోతున్నారంటూ పేర్కొన్నారు.
Minister KTR Said
బుధవారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో 118 జీవో కింద పట్టాలు పంపిణీ చేశారు. సీఎం పాలనలో హైదరాబాద్ విశ్వ నగరంగా రూపు దిద్దుకుంటోందన్నారు. అయితే కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి. అధికారంలోకి వచ్చాక కేవలం ఆరు నెలల పాటు మాత్రమే రాజకీయాలు చేయాలన్నారు. ఆ తర్వాత మిగిలిన నాలుగున్నర ఏళ్లలో అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టాలని పిలుపునిచ్చారు.
పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియ చేయాలని స్పష్టం చేశారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ భారీ ఎత్తున పథకాలను , అభివృద్ది పనులను చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్. ఇందులో భాగంగా 415 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్లాన్ చేశామన్నారు.
Also Read : Jupally Krishna Rao : జూపల్లి చేరిక రేపటికి వాయిదా