Minister KTR : హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ ను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీకి చెందిన నేతలు, శ్రేణులు విస్తృతంగా పాల్గొనాలని కోరారు.
Minister KTR Comment
రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజుకు గుర్తుగా ప్రతి ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ ను నిర్వహిస్తూ వస్తున్నామని స్పష్టం చేశారు కేటీఆర్(Minister KTR). తెలంగాణ జాతి విముక్తి కోసం చావు నోట్లో తల పెట్టిన మహా నాయకుడు తన తండ్రి అని పేర్కొన్నారు. తాను కూడా అమెరికా నుంచి కేవలం ప్రజల బాగు కోసం ఇక్కడికి వచ్చానని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు కేటీఆర్. ప్రజలు తమ వైపు ఉన్నారని ఇది స్పష్టంగా ఉందన్నారు. తాము ఈ పదేళ్ల కాలంలో ప్రతి ఏటా 16 వేలకు పైగా జాబ్స్ ను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. ఏనాడైనా చదువుకుని పరీక్షలు రాశారా అంటూ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు మంత్రి .
29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్షా దివస్ ను విజయవంతం చేయాలని అన్నారు కేటీఆర్.
Also Read : CM KCR : కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు గ్యారెంటీ
.