Minister KTR : మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్లాన్
నది ఒడ్డున ఉన్న పేదలకు ఇళ్లు
Minister KTR : తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడంతో ఎక్కడా పనులు ఆగ కూడదని ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ తనయుడు , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) వరుస సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. పరుగులు పెట్టిస్తున్నారు.
Minister KTR Focus on Double Bedroom Flats
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, కేటాయింపుపై సమీక్ష చేపట్టారు. ఇవాళ ప్రత్యేకంగా మూసీ నది గురించి చర్చించారు. నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూసీ నది ఒడ్డున చాలా మంది పేదలు గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు.
వారికి కనీసం 10,000 డబుల్ బెడ్ రూంలు ఇళ్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. మూసీ ఆక్రమణల తొలగింపు , పేదలకు ఇళ్ల కేటాయింపు కోసం ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేలు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించారు మంత్రి కేటీఆర్.
మూసీ అడ్డంకులు తొలగిన తర్వాత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించి ప్లాన్ పూర్తయిందన్నారు. మొత్తంగా పేదలకు ఇళ్లు అందనున్నాయి .
Also Read : Nagam Janardhan Reddy : జూపల్లి కామెంట్స్ నాగం సీరియస్