KTR Warner Bros : తెలంగాణలో ‘వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ’
ఆనందంగా ఉందన్న మంత్రి కేటీఆర్
KTR Warner Bros : ప్రపంచంలోనే టాప్ దిగ్గజ వినోద సంస్థగా పేరు పొందింది వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ. మంత్రి కేటీఆర్ అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా బుధవారం శుభవార్త చెప్పారు కేటీఆర్. తెలంగాణ వినోద రంగంలోకి గ్లోబల్ మీడియా పవర్ హౌస్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రాండ్ ఎంట్రీని ప్రకటించినందుకు థ్రిల్ (ఉద్విగ్నంగా ) గా ఉందని స్పష్టం చేశారు కేటీఆర్.
మొదటి సంవత్సరంలోనే అత్యధికంగా 1200 మంది ఉద్యోగులతో సృజనాత్మకత, ఆవిష్కరణల కేంద్రమైన తమ అద్భుతమైన ఐడీసీని ప్రారంభించేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సిద్దమని స్పష్టం చేసినట్లు తెలిపారు కేటీఆర్. ఇవాళ ఆయన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ చీఫ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
ఇదిలా ఉండగా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రీమియర్ గ్లోబల్ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ కంపెనీగా గుర్తింపు పొందింది. టెలివిజన్ , ఫిల్మ్ , స్ట్రీమింగ్ , గేమింగ్ లో కీలక పాత్ర పోషిస్తోంది. కంటెంట్, బ్రాండ్ లు, ప్రాంఛైజీలతో ప్రపంచంలోనే అత్యంత భిన్నమైన పూర్తి పోర్ట్ ఫోలియోను అందిస్తోంది.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఒక ప్రీమియర్ గ్లోబల్ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ, ప్రేక్షకులకు టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్ మరియు గేమింగ్ అంతటా కంటెంట్, బ్రాండ్‌లు మరియు ఫ్రాంచైజీల యొక్క ప్రపంచంలోని అత్యంత విభిన్నమైన మరియు పూర్తి పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది.
ఇదిలా ఉండగా గ్లోబల్ మీడియా పోర్ట్ ఫోలియోలో హచ్ బి ఓ, సీఎన్ఎన్, టీఎల్సీ , డిస్కవరీ , డిస్కవరీ ప్లస్ , డబ్ల్యూబీ , యూరో స్పోర్ట్స్ , యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్ వ్క్ , సినిమాక్స్ , హెచ్ జి టీవీ , క్వెస్ట్ ఉన్నాయి.
Also Read : CBI Summons