KTR Modi : మోదీ బెదిరింపుల‌కు భ‌య‌పడం – కేటీఆర్

ప్ర‌ధాన‌మంత్రిపై షాకింగ్ కామెంట్స్

KTR Modi : మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. వ‌రంగ‌ల్ లో శ‌నివారం విజ‌య్ సంక‌ల్ప్ స‌భ‌లో బీఆర్ఎస్ సర్కార్ ను, సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఫోక‌స్ పెట్టాయ‌ని , త్వ‌ర‌లోనే వాళ్ల బండారం బ‌య‌ట ప‌డుతుందంటూ ఎద్దేవా చేశారు మోదీ. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్. మోదీ ప్ర‌సంగం స్వంతంగా లేద‌ని ఎవ‌రో కావాల‌ని త‌యారు చేసి ఇస్తే చ‌దివిన‌ట్లుగా ఉంద‌న్నారు. గుజ‌రాత్ రాష్ట్రానికి లోకోమోటివ్ ప‌రిశ్ర‌మ కోసం రూ. 20 వేల కోట్లు త‌న్నుకు పోయార‌ని ,కానీ తెలంగాణ‌కు కేవ‌లం రూ. 521 కోట్ల‌తో రైల్వే వ్యాగ‌న్ యూనిట్ కు కేటాయించార‌ని ఆరోపించారు.

దేశ చ‌రిత్ర‌లో మోదీ పాల‌న‌లోనే ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగింద‌న్నారు. ప్ర‌తి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని చెప్పిన పీఎం ఎన్ని జాబ్స్ ఇచ్చారో చెప్పాల‌ని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. దేశీయంగా ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఖాయిలా ప‌డేలా చేసిన ఘ‌న‌త మీది కాదా అని ప్ర‌శ్నించారు. 16 ల‌క్ష‌ల ఖాళీలు కేంద్రంలో ఉన్నాయ‌ని ఒక్క పోస్టు అయినా భ‌ర్తీ చేశారా అంటూ నిల‌దీశారు. ప్ర‌భుత్వం పంపిన బిల్లుల‌ను ఆప‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ కు ఎవ‌రు చెప్పారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్. గిర‌జిన యూనివర్శిటీ రాకుండా అడ్డుకున్న‌ది మీరు కాదా అని ప్ర‌శ్నించారు.

15 వేల మందికి ఉపాధి క‌ల్పించే బ‌య్యారం గురించి ఎందుకు ప్ర‌స్తావించ లేద‌న్నారు. న‌ల్ల చ‌ట్టాలు తీసుకు వ‌చ్చి 700 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న‌ది మీరు కాదా అన్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో బెదిరిస్తే ఇక్క‌డ ఎవ‌రూ భ‌య‌ప‌డ‌ర‌న్నారు కేటీఆర్.

Also Read : TTD JEO : టీటీడీ పోర్ట‌ల్ లో ఆల‌యాల స‌మాచారం

 

Leave A Reply

Your Email Id will not be published!