Minister KTR : నిరుద్యోగులు సన్నాసులు – కేటీఆర్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కామెంట్స్
Minister KTR : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, సీఎం హద్దులు దాటుతున్నారు. ప్రత్యేకించి బాధ్యత కలిగిన ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) నోరు జారారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు జాబ్స్ ఏవీ అంటూ నిలదీసి, నినాదాలు చేసిన నిరుద్యోగులపై నోరు పారేసుకున్నారు. నిరుద్యోగులను సన్నాసులంటూ మండిపడ్డారు.
Minister KTR Comments Viral
ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. కావాలని ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు కేటీఆర్.
ఏ ప్రభుత్వమైనా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు రిక్రూట్ చేయదని, నిరుద్యోగులను మోసం చేయడం తప్ప మరొకటి లేదన్నారు మంత్రి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు వేసిన నోటిఫికేషన్లు ఒక్కటి కూడా పూర్తయిన పాపాన పోలేదు. కాగా తాజాగా కేటీఆర్ నిరుద్యోగుల పట్ల చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇంత కండ ఖావరమా అని మండి పడుతున్నారు నిరుద్యోగులు.
Also Read : Eatala Rajender : దొరల రాజ్యం దొంగలదే పెత్తనం